Wednesday, February 3, 2010

వెన్నెల ..!

చప్పుడు లేని చీకటి
మౌనాన్ని దిగమింగుతూ గది
మూలగా దీపం వెలుగుతూ ..
లీలగా ఆమె రూపం ..దీపం వెల్తుర్లో ..
వెనుక అగరొత్తుల పొగ సాగుతూ
వొత్తైన ఆమె కురులని సర్దుతూ అతని వేళ్ళు
మెరుస్తోన్న చెమట చుక్కల్ని తుడుస్తూ ముని వేళ్ళు
కరుగుతున్న కుంకుమ అతని వేలిపై
గోడపై రెండు నీడలు --ఒకటి ఔతున్నట్లుగా
అదిరిపడే పెదవులు మెల్లగా ముడుచుకుంటూ
పెదవులపై తారాడుతూ పెదవులు
మళ్ళీ దీపం వైపు ...
దీపం మెల్లగా వణికి పోతూ
మెల్లగా వెలుగు చీకట్లోకి జారుతూ
ఇంకా మెల్లగా చీకటి వెలుగులో కరుగుతూ
మెల్లగా సాగే నల్లని మబ్బేదో
వేల్లువౌతున్న వెన్నెల్ని
మృదువుగా ముంచేస్తూ..

-



వెన్నెల్ని మృదువుగా ముంచేస్తో..


6 comments:

  1. chala baga explanation icharu good

    ReplyDelete
  2. తెలుగు కవితకు వన్నెలద్దుతున్న శ్రీ మోహన్ రాంప్రసాద్ గారూ, మీ సాహితీ అభిరుచి అభినందనీయం, మీ బ్లాగు అవశ్యం పఠనీయం.
    సాహితి లో కూడా మీ కలం నుండి జాలువారిన అమూల్య రచనలు అలంకృతమవ్వాలని ఆశిస్తున్నాను.

    శుభాకాంక్షలతో.. డా. సి. జయ శంకర బాబు, సంపాదకులు, సాహితి

    ReplyDelete
  3. Dr.Sankar garu.
    Thanks for your invitation.
    I will send HAIKUs shortly..

    ReplyDelete
  4. చలాన్నీ, చండీదాస్ నీ ,వేగుంట మోహన్ ప్రసాద్ నీ చాలా మందిని గుర్తు చేసేస్తున్నారు మీరు.
    అద్భుతం!

    ReplyDelete
  5. why dont you remove word verification sir? Sometimes its really difficult to post a comment with this!

    ReplyDelete
  6. Sujata garu!
    chalam naa praanam.
    chandidas naa hrudayam.
    vegunta[MO] naa preranam.
    mee comment ku koti NENARULU.
    naa badhayatani penchaaru.

    ReplyDelete