Sunday, February 7, 2010

మా అమ్మాయి ..

మా అమ్మాయి
------------
మా అమ్మాయికి
ఓ ఘంటసాలా.. సుశీలా లేరు
బాలమురళినా? ఎక్కడో విన్నట్టు గుర్తు
రవివర్మ ? ..పేరు బాగుందే
బిస్మల్లఖాన్..! ...ఓ ముస్లిం కదూ
సుబ్బులక్ష్మి.. ఇదేమి పేరు?
మాయాబజార్? రైతుబజార!
****------****-----***
మా అమ్మాయికి ...ఇప్పుడంతా--
ఇంటరు నెట్లు ..చాట్లూ
సెల్లులు ..ఎస్సేమ్యేస్సులు
లాపు టాపులూ..ఇపాడులు..
పబ్బులూ ..ఫాస్ట్ బీట్లూ
కంప్యుటరులో గేములూ ..పైరసీ సీడీలు
మా అమ్మాయికి కొన్ని లేవు..!.
లేనివి ..అపురూపమైనవి ..
ఉన్నవి..? నో కామెంట్..
--

4 comments:

  1. బాల మురళి కృష్ణ గారి కర్నాటక సంగీతం , రోజుకి గంట చొప్పున వినిపించాలి.

    ReplyDelete
  2. మా అమ్మాయి మీ అమ్మాయికి వ్యతిరేకం
    అమ్మమ్మల కాలం లో పుట్టాల్సింది దారి తప్పి
    ఈ కాలం లో పుట్టింది అయిననేమి
    ఆ లోటు నేను పూర్తి చేస్తున్నాను .-:):)

    ReplyDelete
  3. ప్రసాద్ గారూ..
    మీరు బులిబుల్లి కవితల్లో,పెదపేద్ద భావాల్ని ఇమిడ్చి భలే పలికిస్తారండీ....

    ReplyDelete