Monday, February 8, 2010

ఆమె చూపులు..!

* ఆమె చూపులు
వెచ్చని చెలిమిని
పంచి ఇచ్చాయి..
***
* ఆమె చూపులు
మనసు లోతుల్లోకి
దిగుతున్నాయి.
***
* ఆమె చూపులు
కలసిన చోటల్లా
కావ్య సుధలె..!
***
* ఆమె చూపులు
నేనుని చెరిపేసి
మనమే నంటూ ..!
***
* ఆమె చూపులు
కొన్ని కవితలకి
ముగింపు నిస్తూ ..!
***
* ఆమె చూపులు
పొంగుతున్న చీకట్ని
వెన్నెలించాయి .

2 comments:

  1. ఆమె చూపులు..పొంగుతున్న చీకట్ని వెన్నెలించాయి...

    వెన్నెలించాయి...ఎంత బావుందో ఈ వ్యక్తీకరణ! వడ్డెర చండీదాస్ గుర్తొస్తున్నాడు.

    ReplyDelete
  2. కవితా చాలా బాగుందండి!

    ReplyDelete