Monday, June 25, 2012

కొందరికి చీకటంటే...

..................కొందరికి చీకటంటే...
మూసిన కన్ను
అంటిన కాటుక
చెక్కిట చుక్క
ఆరిన దీపం
వొట్టి మట్టి
ఆకలి డప్పు
చెరిగిన వేకువ
పుట్టెడు దుఖం
దిగులు దీపం
గాయం గుర్తు
.................నాకు మాత్రం.. చీకటంటే
                 చందమామని చూపించే చిన్నమ్మ .

Friday, June 22, 2012

తను-నేను

తను
నేను
చూపులు
కలలు
క్షణాలు
యుగాలు
కలయిక
మధురిమ
బృ౦దావన౦
జీవన౦
సాఫల్య౦


--సవరణ


’నేను’ కాదు
తనేను

Wednesday, June 13, 2012

అది "వొట్టిమట్టి " కాదు

వొట్టి మట్టి


వొక విత్తు

వొక చినుకు

వొక మొక్క

చుట్టూ క౦చె

చారెడు నీళ్ళు

రె౦డు ఆకులు

కొన్ని కొమ్మలు

కోటి పువ్వులు

చల్లని నీడ



..సవరణ

అది "వొట్టిమట్టి " కాదు

సృష్టి ఉట్టిపడే

అమ్మవొడి