నా లోపల
ఒక మొక్కను నాటాను.
అది చెట్టయింది .
కొన్ని ఊహలు పూచాయి
అవి సీతాకోక చిలుకలతో కలసి
ఎగిరి పోయాయి హాయిగా..
కొన్ని పూవులు పూచాయి
పరిమళాల్ని లోకానికిచ్చి
కొత్త రంగుల్ని కోరుకుంటున్నాయి .
కొన్ని పక్షులు వాలాయి
అవి నిరంతరం గుసగుస లాడుతూ
కొత్త సంగతులు చెప్పుకుంటున్నాయి .
కొంతమంది కవులు నీడన చేరారు
కవిత్వమంటూ ఏమీ చెప్పలేదు కానీ...
కన్నీటి భాషలో మనసుని రాసుకుంటున్నారు
కొందరు మాత్రం మెరిసే కళ్ళతో
ఇంద్ర ధనస్సును చెట్టుకు కట్టే ప్రయత్నంలో ఉన్నారు,
ఆడుకునే పిల్లలకిద్దామని ..
నాలోపల
చాలా మొక్కల్ని నాటాను
ఎప్పుడు చూసినా ఏవో జ్ఞాపకాలు
అక్షరాలుగా అల్లుకోవడం చూస్తున్నాను.
అసలు ..నేను మొక్కలోపల ఉన్నానా!?
Wednesday, March 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
లేరు. మీరు మొక్కలను అపురూపంగా పెంచారు.
ReplyDeletemee rachanalu aalochanalni reketisttunai...inspire chesttunnai....
ReplyDeleteచిగురిస్తూ ఉన్నారు.. క్రొత్త చిగురు వేస్తూనే ఉంటారు...అభినందనలు....
ReplyDelete