Saturday, March 20, 2010

సిరా ఒలికి..

సిరా ఒలికి
అక్షరాలూ తడిసాయి
రాసుకున్న కవితల్ని
కలం మర్చి పోయింది.
కానీ..కాలం నేమరువేస్తోంది.
---------------------
మౌనంగా ..
తెలియనివెన్నో
తెలిసీ తెలియని తలపుల వెనుక
తెరిసీ తెరియని తలుపుల వెనుక
మృదువుగా చప్పుడు చేస్తున్నాయని
మౌనంగా ఉంటేనేగాని ....తెలియలేదు.
రెప్పల వెనుక
మహానదులున్నాయని
ఒక్క కన్నీటి చుక్క
జారేంతవరకు తెలియలేదు.
కలం కదలికల వెనుక
కోటి అక్షరాలూరగుల్తున్నాయని
కవిత పొంగే వరకు తెలియలేదు.
పదునెక్కిన ప్రేమ
కత్తిలా గుచ్చుకుంటుందని
ఆమె చూపులు కలిసెంత వరకు తెలియలేదు.
ఊహల ఊయల వెనుక
కదంతొక్కే లక్షలాది అక్షరాలూ
ఎగసి పడతాయని
దీర్ఘ కవితకి చిరు శీర్షిక
అలవోకగా
జాలువారెంత వరకు తెలియలేదు.

7 comments:

  1. రెప్పల వెనుక
    మహానదులున్నాయని
    ఒక్క కన్నీటి చుక్క
    జారేంతవరకు తెలియలేదు
    చాలా బావుంది!!

    ReplyDelete
  2. చాలా బావుంది.
    మందాకిని గారికి నచ్చిన లైన్సే నాకూ నచ్చాయి

    ReplyDelete
  3. "రెప్పల వెనుక
    మహానదులున్నాయని
    ఒక్క కన్నీటి చుక్క
    జారేంతవరకు తెలియలేదు."

    చాలా బాగుందండి. నిజమే కదా!

    "తెరిసీ తెరియని తలుపుల వెనుక"
    "తెరచీ తెరవని తలుపుల వెనుక" అంటే బాగుంటుందేమోనండి. అన్యధా భావించకండి.

    ReplyDelete
  4. మౌనంగా .. మహానదుల ప్రవాహం వరకు తీసుకువెళ్ళారు. బావుంది.

    ReplyDelete
  5. Thank you..Anonymous gaaru. good correction.
    I like such ...

    ReplyDelete
  6. తెలియనివెన్నో
    తెలిసీ తెలియని తలపుల వెనుక
    తెరిసీ తెరియని తలుపుల వెనుక
    మృదువుగా చప్పుడు చేస్తున్నాయని
    మౌనంగా ఉంటేనేగాని ....తెలియలేదు
    Beautiful!!

    ReplyDelete