Friday, January 22, 2010

పిచ్చుకలు

//

  1. నన్నే చూస్తోంది/ తల్లిలేని పిచ్చుక /దోసిలయ్యాను.
  2. పిచ్చుక గూడు /తుమ్మ చెట్టుకుతోడు/ ఇప్పుడులేదు .
  3. పిచ్చుకవస్తే /ఓ ఇల్లు కడతాను/ ఎప్పటికైనా .
  4. ఒకటే వాన /తడుస్తూ గూళ్ళు -అన్నీ కిచకిచలె.
  5. కొమ్మలనిండా /పిచ్చుకలు వాలాయి /ఊగింది చెట్టు .
  6. వడ్ల గింజని/ గొంతులోకి లాగింది /తీరిందాకలి .
  7. కుడిరెక్కతో/ ముక్కుని గీరుతోంది /చిరాకేందుకో ?
  8. రెండో పిచ్చుక / వచ్చి వాలింది -గూడు ఊగుతూ ఉంది.

4 comments:

  1. పిచ్చుకలపై మీ భావనలు బాగున్నయ్!
    మీరు గమనించే ఉంటారు - పిచ్చుకలు అంతరించిపోతున్నాయి!

    ReplyDelete
  2. crisp and cute

    your blog is good and interesting. go on with poetry sir.

    have a look at this
    http://sahitheeyanam.blogspot.com/2009/01/blog-post_12.html

    bollojubaba

    ReplyDelete
  3. rendava pankthilo thumma chettu anna padam choodagaane chinnappudu telugu patyaamshamgaa chaduvukunna GopiChand gaari Thumma Chettu gurthuku vachindandee :)

    gijigaadu paatamu koodaa gurthochindi :)

    ReplyDelete
  4. మోహనా! మోహనా!

    నువ్విక్కడా?! బహు బ్లాగు, బ్లాగు!
    బ్లాగు ఎంతటి ప్లేగో ఇప్పుడు తెలిసిపోయింది, నిన్ను కూడా ఇది డిస్టర్బ్ చేసిందంటే!

    ఇక్కడ వాలిన ఈ పిచ్చుకలన్నీ అందమయిన రెక్కలు ఎగరేస్తున్నాయి.

    అఫ్సర్

    ReplyDelete