ఉదయం పరుషంగా ఉంటుంది
కాఫీ కప్పు కర్కశంగా అరచేతులో మోగుతుంది
మనసుని ఓ మూలకు ఊడ్చేస్తూ
ప్రేమను ఓ పక్కన పెట్టమంటుంది
ఆమె - ప్రతిఉదయమ్ ఇంకోలా ఉంటుంది
రాత్రికి మాత్రం - పూలుపెట్టుకున్న యంత్రంలా ఉంటుంది. .
యంత్రం వేడికి కొన్ని పూలు మనసు లేని చోట పడి మాడిపోతాయి..
చూస్తూన్నకొద్దీ
ఎందుకు చూడాలనిపించదో అర్ధం కాక
సంసారం చట్టుబండలై కొన్ని కెరటాలని తట్టుకుంటూ అలా ఉండిపోతుంది
రేపటి ఉదయం ఇంకెలా ఉంటుందోనని భయంగా తెల్లారుతుంది
మసకబారిన వెన్నెల
వాసన లేని మల్లెల సాక్షిగా
క్రితం రాత్రి యంత్రం బాగానే పనిచేసింది
రేపటి ఉదయం ఇంకోలా ఉంటుందా?
Tuesday, January 19, 2010
Subscribe to:
Post Comments (Atom)
కలుక్కుమంది మన సమాజం లో యాంత్రికం గా మారే అనేక సంసారాలు గుర్తు వచ్చి. బాగుందండి.
ReplyDeleteవర్డ్ వెరఫికేషన్ తీసెయ్యండి ప్లీజ్ కష్టం గా వుంటుంది ప్రతి సారి ఆ వార్డ్ గోల. థాంక్ యూ
ReplyDeleteYANTRIKANGA JARIGEY PANULAKU
ReplyDeleteUNDI OKA TANTRAM
KORIKALTO UVVILOORUTUNNA
MANASU KI ,
MADILONI ALOCHANALA SUDIGUNDAM TO
MUDI PETTAKAPOVATAME
AA MANTRAM