Thursday, January 28, 2010

ఒక స్పర్శకి ..!

ఒక స్పర్శకి.....
దేహ పుష్పం విచ్చుకోవచ్చు.!
మొగ్గలా ముడుచుకోవచ్చు..!!

మౌన భాష్యం రాగమయం కావచ్చు.!
విలయానంతర నిస్సబ్దమూ కావచ్చు..!!

అరమోడ్పు కనులు కాంతివంతం కావచ్చు.!
విధ్వంసానంతర బీభత్స దృశ్యం కావచ్చు..!!

లాలనగా జీవన కావ్యం మొదలు కావచ్చు.!
జ్వలించే అగ్ని శిఖలా ప్రజ్వరిల్లవచ్చు ..!!

క్షణంలో
ఒక స్పర్శ ......
రెండు విలక్షనాలుగా
విడి పోవచ్చు ..!!


2 comments:

  1. చాలా బాగుంది మోహన్‌ గారూ..

    మౌనాన్నీ, విలయకాల కర్కశ ధ్వనులతోనూ..
    అరమోడ్పు కన్నులను భయంకర సునామీ తోనూ
    జీవన కావ్యాన్ని.. అగ్ని శిఖలు మిగిల్చిన బూడతోనూ పోలిస్తే బాగుండేదనిపించినిది.


    పుష్పానికీ -- మొగ్గకీ ఉన్న సంబంధం
    మిగిలిన పంక్తులలో కనబడటంలేదు.

    అనిపించినది చెప్పాను.. మరోలా అనుకోకండి.

    ReplyDelete