//
- నన్నే చూస్తోంది/ తల్లిలేని పిచ్చుక /దోసిలయ్యాను.
- పిచ్చుక గూడు /తుమ్మ చెట్టుకుతోడు/ ఇప్పుడులేదు .
- పిచ్చుకవస్తే /ఓ ఇల్లు కడతాను/ ఎప్పటికైనా .
- ఒకటే వాన /తడుస్తూ గూళ్ళు -అన్నీ కిచకిచలె.
- కొమ్మలనిండా /పిచ్చుకలు వాలాయి /ఊగింది చెట్టు .
- వడ్ల గింజని/ గొంతులోకి లాగింది /తీరిందాకలి .
- కుడిరెక్కతో/ ముక్కుని గీరుతోంది /చిరాకేందుకో ?
- రెండో పిచ్చుక / వచ్చి వాలింది -గూడు ఊగుతూ ఉంది.
