Monday, April 26, 2010

ఏటి ఒడ్డున కాసేపు..

ఏటి ఒడ్డున పూలచెట్టు
మృదువుగా ఊగుతోంది .
ప్రతి అలా
పూలప్రతిరూపాల్ని
అపురూపంగా మోసుకెల్తున్నాయి
ఆవలి ఒడ్డున
అలసి ఆగిన పడవ
తడవ తడవకీ ఉలిక్కి పడుతోంది .
సాయంత్రాన్ని పెనవేసుకుంటూ
చిరుగాలి పరిమళిస్తోంది..
తొలిసంద్యనినెమరేసుకుంటూ
పరవశిస్తూ ఓ కవి ..
ఇరు తీరాలని ముడివేసుకుంటూ
ప్రవహిస్తూ యేరు..
కూటి కెళ్ళిన పక్షులు
గూటికి చేరుతూ కువకువలు..
తగుల్తున్న అలల్లో
జారిన జ్ఞాపకాలని
తడుముకుంటూ
ఏటి ఒడ్డున నేను.





5 comments:

  1. ఆవలి ఒడ్డున అలసి ఆగిన పడవ తడవ తడవకీ ఉలిక్కి పడుతోంది . సాయంత్రాన్ని పెనవేసుకుంటూ చిరుగాలి పరిమళిస్తోంది....
    .....బావుందండీ!

    ReplyDelete