Tuesday, April 13, 2010

వెన్నెల లాంటి ..

వెన్నెలలాంటి ఆమె భుజాలమీంచి నల్లనిత్రాచు మెల్లగా ప్రాకి పొంగుతున్న గుండెల మీద ఊగిసలాడే
పూలదండనివాసన చూసి సన్ననడుంని చుట్టూరా చుట్టుకొని నాభిలోకి జారిపోగానే తెల్లని ఓ పూమొగ్గ బిగుసుకున్న రేకుల్ని సౌమ్యంగా విప్పుకుంటూ కెవ్వునపెట్టినకేకకి గుడి శిఖరం మీద అటునిటు తిరిగే
పావురాయి కువకువ లాడుతూ వేకువని ముక్కున కరచుకొని ఆకాశాన్ని పొడుచుకుంటూ పడమర దిక్కుకి
సూటిగా చూస్తూ రెక్కల్ని సారించి నిన్నటి జ్ఞాపకాల్ని విసిరేసింది.

3 comments:

  1. వెన్నెలలాంటి రాత్రిని దాటి... నల్లనిత్రాచులాంటి చీకటిని వదలి... వేకువ రెక్కల్ని విప్పుకుంటూ తొలికోడి పెట్టిన కేకతో పడమర దిక్కుకి సూటిగా చూస్తూ నిన్నటి జ్ఞాపకాల్ని విసిరేస్తూ ఈసారి ఉదయించింది కొంగ్రొత్తగా మీ హైకూ!

    ReplyDelete
  2. మరికొన్ని పంక్తులు ఉంటే breathlessగా చదువుకునేలా ఉండేది.

    ReplyDelete
  3. ఊపిరి అందకే, జ్ఞాపకాలని విసిరేసాను నాయుడు గారూ..!

    ReplyDelete