Tuesday, December 13, 2011

మా ఊరి హైకూలు

30 . మాఊరి తిరణాల్లో
కుక్కపిల్ల పోయింది
నిరుడుపోయి దొరికింది 


31 . చీకటి రాసుకున్న పాట
వెన్నెలై కురుస్తోంది 
మా పల్లె మల్లె పందిళ్ళ మీద 


32 .మా ఊరి మీంచి చంద్రుడు
వెళ్తూనే ఉన్నాడు
నా బాల్యాన్ని  చూస్తూ


33 పెద్ద అమీరు 
పులివేషం వేస్తే చుట్టూ 
పిల్లమేకలం మేమే 


34 గాలిపటాలు గోళీలు
కాగితం పడవలు 
మేం వదిలేసిన ఆస్తులు 


35 పుస్తకాల్లో దాచిన
 నెమలీకలు
చిన్నప్పటి జ్ఞాపికలు











2 comments:

  1. << చీకటి రాసుకున్న పాట
    వెన్నెలై కురుస్తోంది
    మా పల్లె మల్లె పందిళ్ళ మీద

    wow.. wow.. wow!

    ReplyDelete