Sunday, December 25, 2011

మా ఊరి హైకూలు 90

84 .
ఆడపిల్లలందరూ
హాజరైన రోజు
లెక్కలు తికమక

85 .
మా ఊరిలోపల
మరోఊరు ఉంది
అక్కడంతా ఒక్కటే

86 .
రైలాగినప్పుడల్లా
మా గొడ్డకాడిబుడ్డాళ్ళు
ఇటెక్కి అటుదిగేవాళ్ళు

87 
పలకా బలపం పోయినా 
మా బడి నన్ను ఓదార్చి 
తీర్చిదిద్దింది

88 
నా చిన్నప్పటి చందమామని
పిల్లలకు చూపించాను
మా ఊరు తీసుకొచ్చి

89 
ఊరుకి వెళతానా
ఊరికే ఉండదు
ఊరించి హైకూనిస్తుంది

90 
మా జొన్న చేను
ఆకలిని జయించే
ఆయుధాన్ని విసుర్తోంది



2 comments:

  1. 84 చిలిపిగా, 86 తాత్త్వికంగా, 89 చాసో వాయులీనం లా మనసుని ఎక్కడో తడుతూ ఉన్నాయి. మీరు మీ ఊరు వెళ్ళగలుగుతున్నారు. మా ఊరుని నేను తలుచుకోవడమే. అందనంత దూరం లో ఉంది.
    మంచి కవిత్వాన్ని అందిస్తున్నందుకు అభినందనలు.

    ReplyDelete
  2. Thanks for your valuable comment.. Yes.. I have translated my past memories into haikoos..just i did it..

    ReplyDelete