Wednesday, December 14, 2011

మా ఊరి హైకూలు

36 . పంటచేల మట్టితో
పరిమళించిన బాల్యం
మా ఊళ్ళో ఇంకా ఉంది

37 . వాన పడగానే
నేనూ వరిచేనూ
 పొంగిపోయే వాళ్ళం 

38   పాగొడ్ల  చావిట్లో
   దమ్ముకోట్టేవాళ్ళం
మామయ్యకెలా తెలిసేదో

39 . మే0 చూస్తుండగానే 
      కలువలు విచ్చుకునేవి 
     ఇహ మమ్మల్నే చూసేవి 

40 .  అప్పుడు తెలీదుకాని
మాపంట పొలాలన్నీ
పచ్చని కవితలే

41 . ఇసుకదిబ్బల్లో
మాపిల్లలు వేళ్ళు పెడితే
నాబాల్యం దొరికింది


మా ఊరి హైకూలు

5 comments:

  1. ఇసుకదిబ్బల్లో
    మాపిల్లలు వేళ్ళు పెడితే
    నాబాల్యం దొరికింది ...

    This is excellent.

    ReplyDelete
  2. అప్పుడు తెలీదుకాని
    మాపంట పొలాలన్నీ
    పచ్చని కవితలే

    నిజమే!

    ReplyDelete
  3. వాన పడగానే
    నేనూ వరిచేనూ
    పొంగిపోయే వాళ్ళం

    నిజమే!!

    అప్పుడు తెలీదుకాని
    మాపంట పొలాలన్నీ
    పచ్చని కవితలే

    yes. U r true. చాలా బాగున్నాయి సర్ మీ హైకూలు.

    ReplyDelete
  4. చాలా చాలా బాగున్నాయండీ..

    ReplyDelete
  5. ఇసుకదిబ్బల్లో
    మాపిల్లలు వేళ్ళు పెడితే
    నాబాల్యం దొరికింది
    idi chala chala bagundi.. i like it very much.
    keep posting such good hikoos

    ReplyDelete