Sunday, June 20, 2010

ఆ క్షణం

ఉన్నపాటి కొద్ది స్తలంలో
ఓ పూరిపాక ఉండేది.
ఓ దీపం ఉండేది.
నా ముద్ద నేను తినేవాడిని.
కాల గమనం లో అక్కడో భవంతి కట్టాను.
గర్వంగా తలెత్తుకొని వెళ్తే
గుమ్మం తగిలి తలకి బొప్పికట్టింది.
ఎంతకూ తగ్గని నొప్పిని భరించలేక
స్కానింగ్ తీస్తే,
తలలో రక్తం గడ్డ కట్టిందన్నారు.
ఆలోచనలేమీ పెట్టుకోవద్దన్నారు.
.....కానీ
పూరిగుడిసె గుర్తుకొచ్చింది.
దాన్లోని దీపం గుర్తుకొచ్చింది.
నా ముద్ద గుర్తుకొచ్చింది.
తలను వొంచి
నా మానాన నేను బతికిన ఆ క్షణం గుర్తుకొచ్చింది.
'ఈ ఒక్క లక్షణం చాలు
ఎవరైనా మళ్ళీ బతకడానికి' అంటున్నారు .

7 comments:

  1. బావుంది.
    సంపాదన పెరిగే కొద్దీ ఇబ్బందులే

    ReplyDelete
  2. " ఆక్షణం " లో ఓ కధ మొత్తం చెప్పేశారు...! బావుంది.

    ReplyDelete
  3. గతించిన జ్ఞాపకాలలోంచే పునర్జన్మ అన్నమాట ! బావుందండీ

    ReplyDelete