చీకటికి భయపడి
కల్లుమూసుకున్నవారు ,
తళ్ళత్తళ్ళల దివ్య నక్షత్ర కాంతిని
కోల్పోయారు కదా..!
........నిజానికి భయపడి
........వొంగి వొంగి నంగిగా నడిచేవారు,
........అబద్ధపు అశుద్ధ కొలిమిలో
........తగలబడి పొయారుకదా...!
---ఈ రెండింటికీ భయపడక
ఎదురు నిలబడి
జీవితపు అట్టడుగు పొరల్లోని
శూన్యతరంగాల్కి --దివ్య సంగీతాన్ని చేర్చి ,
కొన్ని పాటల్ని కట్టి వెళ్ళారు కదా..!
ఏ ఒక్క పాటైనా
గొంతులో చిక్కడితే
బ్రతుకంతా పాడుకోడానికి
వెనుకాడని క్షణం కోసం .....
ఈ వెతుకులాట...!!!
Sunday, June 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
బ్రతుకు బాటలో బ్రతుకు పాటకై వెతుకులాటలో...
ReplyDeleteకొనసాగలేక వెనుకాడిన క్షణంలో...
చురుక్కుమంటూ తగిలింది నిజంలాంటి నిప్పులా...
ఈసారి అక్షర మోహనం!