అప్పుడేం జరిగిందంటే ....
ఆకాశం మెల్లగా ప్రవహించి
అలవోకగా కోనేటి
అలల్లో వొదిగింది.
---------నీలి తామరలు ఇంకా మెల్లగా
రేకులన్నీ విప్పుకొని
నింగి వైపు చూస్తున్నాయి.
క్షణ కాలంలో ...కాలం
నీలంగా మారి
ఎవరినైనా సరే ...
తనలోకి వొంపు కోవాలని చూస్తోంది.
....కోనేటిలో
.... కొన్ని నీలి తామరల ప్రతిరూపాలు
.... నన్నెందుకు రమ్మంటున్నాయి..!!??
Friday, June 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఏమో?......
ReplyDeleteఈసారి హైకూ కాస్త ప్రత్యేకంగా ... ఉల్లాసంగా ... ఉత్సాహంగా ... చాలా బావుంది!
Beautiful!
ReplyDeleteనాకా ప్రదేశానికి వెళ్ళాలనిపిస్తోంది మీ కవిత చూసాక.. ;-)
"ఆకాశం మెల్లగా ప్రవహించి
ReplyDeleteఅలవోకగా కోనేటి
అలల్లో వొదిగింది." ఎంతందంగా చెప్పారు !!