Wednesday, June 2, 2010

చూపులు

తలవాకిట్లో
అమ్మ కళ్ళాపుజల్లి
అలికి ముగ్గులేసినపుడు
నా చూపు
ఓ చుక్కకు గుచ్చుకుంది .
నుదుటిమీద పడే కురుల్ని
అర చేతిని తిరగేసి
అమ్మ-పైకి సర్దుకున్నపుడు
నా చూపు
చిరుచెమటలో తడిసినది.
నా చూపులన్నీ
అక్షరాలకి పెనవేసి
వొకానొక వేకువలో
నన్ను తన చేతుల్లోంచి
నేలమీదకు దించిందని
అమ్మ చూపులు
మసకబారాక తెలిసింది .


2 comments:

  1. కూడలి లో వెతుకుతున్న నా చూపులకు ' చూపులు ' కలిశాయి !...
    ఆపై బ్లాగు వెంబడి పరుగిడిన నా చూపులకు అమ్మ జ్ఞాపకపు నీటి తెర అడ్డురాగా అక్షరాలు మసకబారాయి.....

    ReplyDelete