మా పాపకి గాలి సోకితే
మా ఖాసీం భాయ్ తావీదు కడతాడు ..!
ఖాసీం భాయ్ ఇంట్లో కష్టం వస్తే
మరు క్షణం లో నేను నడుం కడతాను...!!
----------------------------
ఓ పావురాయి
మందిరం మీంచి మసీదు మీదికి
మసీదు మీంచి మందిరం మీదికి
చానాళ్లుగా తిరుగుతోంది ..
ఆకలి వేస్తె
నాలుగు గింజల కోసం
ఊరి వైపు ఎగురుతోంది...
------------------
మతములన్ని మాసి పోవును ..
మమతల దీపం నిలిచి వెలుగును ....
--------------------------
Subscribe to:
Post Comments (Atom)
మోహనా:
ReplyDeleteబాగుంది ఈ కవిత
ఆ చివరి రెండు లైన్లూ అవసరమా?
అఫ్సర్
ఓ పావురాయి
ReplyDeleteమందిరం మీంచి మసీదు మీదికి
మసీదు మీంచి మందిరం మీదికి
చానాళ్లుగా తిరుగుతోంది ..
మనిషి లా అది ఆలోచించలేదు గదండి. అందుకే అది అంత హాయిగా ఎ భేదాలు లేకుండా మందిరం నుంచి మజీదు కు మజీద్ నుండి మందిరానికి .....మనిషి ఎప్పుడో .. బాగుంది మీ కవిత
అవునవును పాపం పావురానికి తెలియదు నేల పైన జరిగే సంగతి...!
ReplyDelete