Showing posts with label ఖాసీం భాయ్ ..ఓ పావురం.. ఓ దీపం. Show all posts
Showing posts with label ఖాసీం భాయ్ ..ఓ పావురం.. ఓ దీపం. Show all posts

Thursday, October 7, 2010

ఖాసీం భాయ్ ..ఓ పావురం..ఓ దీపం

మా పాపకి గాలి సోకితే
మా ఖాసీం భాయ్ తావీదు కడతాడు ..!
ఖాసీం భాయ్ ఇంట్లో కష్టం వస్తే
మరు క్షణం లో నేను నడుం కడతాను...!!
----------------------------
ఓ పావురాయి
మందిరం మీంచి మసీదు మీదికి
మసీదు మీంచి మందిరం మీదికి
చానాళ్లుగా తిరుగుతోంది ..
ఆకలి వేస్తె
నాలుగు గింజల కోసం
ఊరి వైపు ఎగురుతోంది...
------------------
మతములన్ని మాసి పోవును ..
మమతల దీపం నిలిచి వెలుగును ....
--------------------------