Tuesday, November 27, 2012

ఆమె అందమొక కేంద్ర బిందువు .......

ఆమె అందమొక కేంద్ర బిందువు లేని వృత్తం


పసుపచ్చని నీరెండలో లీలగా వెలసిన సన్నని వర్షం

చిమ్మచీకట్లో సుతారంగా అంతర్లీనమైన కాంతిపుంజం

పండువెన్నెల్లో వెల్లివిరిసిన  ముద్ద మందార పుష్పం

ఇంత తీరాన్ని కొంత దూరం వొదిలివెళ్ళిన కల్లోల సముద్రం

నున్నగా జారే వేయి వొంపుల్ని సొంతం చేసుకున్న మరకత శిల్పం

పదునుతో రెండువైపులా మెరుస్తోన్న రత్న ఖచిత సౌందర్య ఖడ్గం




Friday, October 19, 2012

తిరిగిరాని నీ కోసం

నీవు నా  ఎదుట ఉన్నప్పుడు
నీ కోసం ఆలోచించని నేను
నీవు నన్ను విడిచి  వెళ్ళాక
నీ కోసం ఆలోచిస్తున్నా.. తిరిగిరాని నీ కోసం !

Sunday, October 14, 2012

ఏడురంగుల్ని

సీతాకోక చిలుక


కొన్ని రంగుల్ని

పూలతోటకిచ్చింది.

-------------

ఇంద్రధనసు

ఏడురంగుల్ని

ఇటునుంచి అటు విసిరేసింది.

---------------

సాయంకాలం

అరుణకాంతుల్ని

రేపటికిచ్చింది

ఆమె పాదముద్రల్ని

తడవతడవకీ అలలు


తీరానికి చేరి

ఆమె పాదముద్రల్ని వెతుకుతున్నాయి .

--------------------

పూలకొమ్మలు

తెగ ఊగి ఊగి

ఆమె పాదముద్రల్ని దాస్తున్నాయి.

--------------------

రాత్రంతా వాన చినుకులు

కురిసి కురిసి

ఆమె పాదముద్రల్ని చెరిపేసాయి

Tuesday, September 18, 2012

oka haiku

oka haiku

స0గీతానికీ


మాతృభాష ఉన్నది

అది మౌనమె....

Monday, June 25, 2012

కొందరికి చీకటంటే...

..................కొందరికి చీకటంటే...
మూసిన కన్ను
అంటిన కాటుక
చెక్కిట చుక్క
ఆరిన దీపం
వొట్టి మట్టి
ఆకలి డప్పు
చెరిగిన వేకువ
పుట్టెడు దుఖం
దిగులు దీపం
గాయం గుర్తు
.................నాకు మాత్రం.. చీకటంటే
                 చందమామని చూపించే చిన్నమ్మ .

Friday, June 22, 2012

తను-నేను

తను
నేను
చూపులు
కలలు
క్షణాలు
యుగాలు
కలయిక
మధురిమ
బృ౦దావన౦
జీవన౦
సాఫల్య౦


--సవరణ


’నేను’ కాదు
తనేను