స్నిగ్ధ సౌందర్యంతో తళుకులీనుతూ జ్వలించేకళ్ళతో మత్తిల్లుతూఆమె అర్ధనగ్నంతో ఒకవైపు వోత్తిగిల్లినప్పుడు కోటి నక్షత్రాలు వికసించి వెల్లివిరిసిన పున్నమివెన్నలకిసవాలుగా నిలిచాయి.విప్పారిన పూలతీగల తాకిడికి నిలువెత్తుగోడలుఓ పక్కకి వొరిగి నేలకుభారంగా నిలిచాయి. చిరుగాలి ఆమె నల్లని కురులని కదల్చి చీకటి చేతిలో ఉంచి ఎటో వెళ్ళిపోయింది. వెచ్చని ఆమె శ్వాసలో ఆవిష్కరించబడ్డ నీలి ఆకాశం రెండు మబ్బుతునకల్ని కానుకగా పంపించింది. ఒకచినుకు,రెండుచివురులు ,పూలకొమ్మలు,వాలితూలిపోతున్న తుమ్మెదలు,రెక్కలరా ఎగురుతున్న సీతాకోకలు,ఒక కోకిల పాట ఆన్నింటినీ ఆమె ఓరగా గమనించి పలకరించాకుండానే గడ్డిపోచని దానిమీద మెరుస్తోన్న మంచు బిందువుని వేలికోసల్తో నిమిరి వెళ్ళిపోయింది ..అనంతమైన ఒంటరితనాన్ని దోసిళ్లకొద్దీ నా చుట్టూరా పోసి..!
Thursday, February 3, 2011
Friday, January 7, 2011
అందమైన తీరం
అలల్లో
అలలా కదిలే చందమామపై
చివురాకులు రాల్తున్నాయి.
రంగురంగుల పూలరేకుల ప్రతిబింబాలు
నదిలోతుల్లోపరిమళాల్ని దాస్తున్నాయి.
****ఇంతలో ఓ పడవ వచ్చి
ఈ అందమైన దృశ్యాన్ని
మెల్లగా లాక్కెళ్ళింది.
పడవని వెంటాడి
ఓ తీరంలో పట్టుకున్నాను.
పడవలోంచి చందమామలు
పొంగిపొర్లుతున్నాయి.
పూలరేకులు సీతాకోకల్లా ఎగిరిపోతున్నాయి.
వేలాది ప్రతిబింబాలు
నా మనసులో వొదిగి పోతున్నాయి.
దూరాన్నించి మరోపడవ వస్తోంది.
ఇహ ఈ తీరం వదిలి ఎలా వెళ్ళను??
అలలా కదిలే చందమామపై
చివురాకులు రాల్తున్నాయి.
రంగురంగుల పూలరేకుల ప్రతిబింబాలు
నదిలోతుల్లోపరిమళాల్ని దాస్తున్నాయి.
****ఇంతలో ఓ పడవ వచ్చి
ఈ అందమైన దృశ్యాన్ని
మెల్లగా లాక్కెళ్ళింది.
పడవని వెంటాడి
ఓ తీరంలో పట్టుకున్నాను.
పడవలోంచి చందమామలు
పొంగిపొర్లుతున్నాయి.
పూలరేకులు సీతాకోకల్లా ఎగిరిపోతున్నాయి.
వేలాది ప్రతిబింబాలు
నా మనసులో వొదిగి పోతున్నాయి.
దూరాన్నించి మరోపడవ వస్తోంది.
ఇహ ఈ తీరం వదిలి ఎలా వెళ్ళను??
Monday, January 3, 2011
పూలతీగ చెంపలకి రాసుకుంటూ
చాలా విషాదంగా ఓ బాధామయరేఖ నా చెంపల మీద ఏదో రాసుకుంటూ వెళ్ళింది. కన్నీటి చుక్క దాన్ని చేరిపెసేముందు ఓ చిరునవ్వు నన్ను మేల్కొలిపి నెమ్మదిగా నా తలని తన ఒడిలోకి తీసుకొంది. ఎవరివో, నునులేత తీగాల్లాంటి మొనదేలిన వేళ్ళు మెల్లగా నా తలలోకి చొచ్చుకుపోయాయి. మెత్తని బరువెక్కిన పెదవులు నుదురుమీద కుదురుగా ఆగి వెచ్చని స్పర్శకోసం ఎదురుచూస్తూ అందక జారిపోయాయి.
క్షణ కాలంలో కన్నీటి తడి ఆరిపోయి లోపలి బాధల్ని ఇంకెవ్వరికీ తెలీని మూలల్లోకి లాక్కెళ్ళి చిరుగాలితో ఏదో గుసగుసలాడి ఓ పూలతీగతో చెంపలకి రాసి వెళ్ళింది. నేనింక తీగచుట్టూ అల్లుకొని కొన్ని పూలని దోసిట్లో పోసుకొని ఆమె వెళ్ళే దారిలో పోసి అరచేత్తో అద్ది అద్ది ఉంచాను. కొన్నిపూలు గాలికి చెదిరి పక్కకు దొర్లాయి పరిమళిస్తూ..మరికొన్ని పూలు ఆమె రాక కోసం ఎదురుచూస్తూ నిశ్చలంగా అలానే ఉన్నాయి..నాకు తోడుగా ..చాన్నాళ్ళుగా ..
క్షణ కాలంలో కన్నీటి తడి ఆరిపోయి లోపలి బాధల్ని ఇంకెవ్వరికీ తెలీని మూలల్లోకి లాక్కెళ్ళి చిరుగాలితో ఏదో గుసగుసలాడి ఓ పూలతీగతో చెంపలకి రాసి వెళ్ళింది. నేనింక తీగచుట్టూ అల్లుకొని కొన్ని పూలని దోసిట్లో పోసుకొని ఆమె వెళ్ళే దారిలో పోసి అరచేత్తో అద్ది అద్ది ఉంచాను. కొన్నిపూలు గాలికి చెదిరి పక్కకు దొర్లాయి పరిమళిస్తూ..మరికొన్ని పూలు ఆమె రాక కోసం ఎదురుచూస్తూ నిశ్చలంగా అలానే ఉన్నాయి..నాకు తోడుగా ..చాన్నాళ్ళుగా ..
Tuesday, December 7, 2010
పాప కళ్ళల్లో ...
వాన వెలిసింది.
అంతపెద్ద ఆకాశంలో
ఇంద్రధనసు
ఏడురంగుల్లో మెరిసింది.
కానీ ......
పాప చిన్ని కళ్ళల్లో
వేయి రంగులతో మెరుస్తోంది.
అంతపెద్ద ఆకాశంలో
ఇంద్రధనసు
ఏడురంగుల్లో మెరిసింది.
కానీ ......
పాప చిన్ని కళ్ళల్లో
వేయి రంగులతో మెరుస్తోంది.
హైకులు -3
ఆమె కనులు
తడవడమంటేనే
బతుకు సున్నా.
----------------
ఈ రెండు కళ్ళు
తడిసాక తెలిసింది
బతుకు లోతు.
----------------
కంట తడిని
తుడిచే వేళ్ళు౦టేనే
బతుక్కి అర్ధం.
----------------
తుడిచే velluntene
తడవడమంటేనే
బతుకు సున్నా.
----------------
ఈ రెండు కళ్ళు
తడిసాక తెలిసింది
బతుకు లోతు.
----------------
కంట తడిని
తుడిచే వేళ్ళు౦టేనే
బతుక్కి అర్ధం.
----------------
తుడిచే velluntene
Monday, December 6, 2010
పొన్నచెట్టు నీడలో ..
పొన్నచెట్టు కింద
నిలబడ్డాను.
విరిసిన పూలు కొన్ని,
మరికొన్ని రాలిన పూలు
నాలోని అక్షరాలని
పలకరించాయి.
---కాలం పరిమళిస్తూ
నాకు తోడుగా ఉంది.
నిలబడ్డాను.
విరిసిన పూలు కొన్ని,
మరికొన్ని రాలిన పూలు
నాలోని అక్షరాలని
పలకరించాయి.
---కాలం పరిమళిస్తూ
నాకు తోడుగా ఉంది.
Wednesday, December 1, 2010
మోయలేని మనసు ..
హైకులు
======
కనురెప్పలు
తెలియని నదిని
దాచివుంచాయి.
---------------
కన్నీటి చుక్క
లోలోపలి బాధని
ఆరబోస్తోంది.
--------------
కన్నీటి చుక్క
బరువెంతో తెల్సింది
జారిపడ్డాక.
-----------
కంట తడిని
మోయలేని మనసు
చెంపకిచ్చింది.
--------------
======
కనురెప్పలు
తెలియని నదిని
దాచివుంచాయి.
---------------
కన్నీటి చుక్క
లోలోపలి బాధని
ఆరబోస్తోంది.
--------------
కన్నీటి చుక్క
బరువెంతో తెల్సింది
జారిపడ్డాక.
-----------
కంట తడిని
మోయలేని మనసు
చెంపకిచ్చింది.
--------------
Subscribe to:
Posts (Atom)
