Friday, January 7, 2011

అందమైన తీరం

అలల్లో
అలలా కదిలే చందమామపై
చివురాకులు రాల్తున్నాయి.
రంగురంగుల పూలరేకుల ప్రతిబింబాలు
నదిలోతుల్లోపరిమళాల్ని దాస్తున్నాయి.
****ఇంతలో ఓ పడవ వచ్చి
ఈ అందమైన దృశ్యాన్ని
మెల్లగా లాక్కెళ్ళింది.
పడవని వెంటాడి
ఓ తీరంలో పట్టుకున్నాను.
పడవలోంచి చందమామలు
పొంగిపొర్లుతున్నాయి.
పూలరేకులు సీతాకోకల్లా ఎగిరిపోతున్నాయి.
వేలాది ప్రతిబింబాలు
నా మనసులో వొదిగి పోతున్నాయి.
దూరాన్నించి మరోపడవ వస్తోంది.
ఇహ ఈ తీరం వదిలి ఎలా వెళ్ళను??

2 comments:

  1. ఇంత అందమైన తీరం వదలి మీరె కాదు ఎవరూ వెళ్ళ లేరు చాలా బాగుంది మీ అందమైన తీరం

    ReplyDelete