Thursday, February 17, 2011

ముగ్గు

ఆమె చూపుడువేలుకీ
బొటనవేలుకీమధ్య
నువ్వు ముగ్గుపిండివైతేచాలు..
చుక్కలు చుక్కలుగా పడుతున్న నిన్ను
తనవైపు కలుపుకుంటుంది...!
ఆమె కోపానికీ
చిరు అలకకీ మధ్య
నువ్వు మౌనంగా ఉంటేచాలు..
పక్కన పక్కన చేరి నిన్ను
తనవైపుకు తిప్పుకుంటుంది ..! !

9 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Mohan garu namaste!...

    idi nijanga nice-frame

    నా మనవేమిటంటే ..దీనిని ఇలాగే కొనసాగించి ప్రచురించగలరు..చదివి తరించాలని వుంది.

    "ఆమె తలపుకీ
    తొలి పిలుపుకీ మధ్య
    నీ సహనం నిలపు చాలు
    చీకటి నిండిన చిన్ని గుండెలో
    వెలుగులు నింపే వెన్నలై వస్తుంది....."


    --satya

    ReplyDelete
  3. సత్య గారు..! మీ స్ప0దన వెన్నెల ముగ్గు వేసింది.

    ReplyDelete
  4. మీ కవితా, సత్య గారి కొనసాగింపూ రెండూ చాలా బావున్నాయి

    ReplyDelete
  5. good poetry. touch the heart very much

    ReplyDelete
  6. "ఆమె ఆరబోసిన ముగ్గులో
    మెలికలు తిరిగిన లతల మధ్య
    నువ్వు అలరించే రంగవల్లివైతేచాలు..
    రంగురంగులుగా కనబడే నిన్ను
    తను ముగ్గులోకి దింపుతుంది...!"

    మీ కవితా, సత్య గారి కొనసాగింపూ రెండూ చదివాక
    నాకు తోచింది వ్రాయాలనిపించింది.....అంతే

    ReplyDelete
  7. తన జీవితపు తొలిపొద్దుకి, మలిసందె కి మధ్యన విరామమైతే చాలు,
    మన జీవిత మంతా ఆరామమౌతుంది.....అమ్మగా, అక్కగా, ఆలిగా, తనయ గా..
    (నేను కవిని కాను, కానీ ఆ మాట నేనే అనాలి మీరెవరన్న అంటే .....)

    ReplyDelete
  8. THANKS to LATHA-SATHYA-ANONY-DHARANI & ATHREYA
    YOUR RESPONCE INSPIRED ME IN SUCH A MANNER.

    ReplyDelete
  9. mohanramprasad గారు, నమస్కారాలు!

    కవితా పోటీకి ఆహ్వానం


    http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

    మీ నుండి కవితని తప్పక ఆశిస్తాను!

    మీ సత్య.

    ReplyDelete