91 .
పచ్చని పైరు
నిత్యం పారే యేరు
మా ఊరికి౦కేం కావాలి
92 .
తలలూపుతూ
వరిచేలు -రమ్మనో
వెళ్లి పొమ్మనో
93 .
ఊరు తెన్నేరు
అక్షర సంపదని
ఇచ్చిన ఊరు
94 .
గోళీలు గూటీ బిళ్ళలు
ఒంటినిండా దుమ్ము
మా పిల్లలకి అంటుకోలేదు
95
గోడలమీద బోలెడు
geetalu గీసేవాళ్ళం
పికాసోకు తెలుసు
96
మా పందిరి మంచం
తాతయ్య గుసగుసల్ని
దిండుకింద దాచింది
97 .
తెలుగు మాస్టారు
పద్యానికి అర్ధం చెబుతుంటే
అమ్మ ముద్డ కలుపుతున్నట్లు౦డేది
98 .
బడికెళ్ళేదారిలో
పెద్దపెద్ద చెట్లు
నీడనివ్వడం నేర్పాయి
99 .
నల్లకలువలు
మాచెరువులో మొగ్గతొడిగి
ఆకాశంలో వికసిస్తాయి
100 .
మాఊరి చెరువు
ఉన్నట్టుండి అలల్లో
ఆకాశాన్ని దాచేస్తుంది
101 ఆఖరి రోజు
మాస్టారు తలనిమిరారు
కవిత్వం తలకెక్కింది .
[ హైకూ రాయందే
ఊరూ యేరూ వెన్నెల
ఉండనివ్వవు నన్నిలా ]
పచ్చని పైరు
నిత్యం పారే యేరు
మా ఊరికి౦కేం కావాలి
92 .
తలలూపుతూ
వరిచేలు -రమ్మనో
వెళ్లి పొమ్మనో
93 .
ఊరు తెన్నేరు
అక్షర సంపదని
ఇచ్చిన ఊరు
94 .
గోళీలు గూటీ బిళ్ళలు
ఒంటినిండా దుమ్ము
మా పిల్లలకి అంటుకోలేదు
95
గోడలమీద బోలెడు
geetalu గీసేవాళ్ళం
పికాసోకు తెలుసు
96
మా పందిరి మంచం
తాతయ్య గుసగుసల్ని
దిండుకింద దాచింది
97 .
తెలుగు మాస్టారు
పద్యానికి అర్ధం చెబుతుంటే
అమ్మ ముద్డ కలుపుతున్నట్లు౦డేది
98 .
బడికెళ్ళేదారిలో
పెద్దపెద్ద చెట్లు
నీడనివ్వడం నేర్పాయి
99 .
నల్లకలువలు
మాచెరువులో మొగ్గతొడిగి
ఆకాశంలో వికసిస్తాయి
100 .
మాఊరి చెరువు
ఉన్నట్టుండి అలల్లో
ఆకాశాన్ని దాచేస్తుంది
101 ఆఖరి రోజు
మాస్టారు తలనిమిరారు
కవిత్వం తలకెక్కింది .
[ హైకూ రాయందే
ఊరూ యేరూ వెన్నెల
ఉండనివ్వవు నన్నిలా ]
మీరు అధ్బుతం గా రాస్తారు ! మీరు రాసే ప్రతీది నాకు ఇష్టం ..
ReplyDeleteచిన్ని పదాలు, ఎన్నో భావాలతో
ReplyDeleteసుతిమెత్తగా తాకుతాయి...
Beautiful!
ReplyDeleteThanks for your comments.. Wish you a Happy New year ..Thanks to 2011.. This year has given very good literary friends like you all..Many Many thanks to AAAAAAAALLLLLLL BLOG LOVERS..
ReplyDeleteFrom 95 on they are just superb. 98 I liked the most. Rest a fraction less.
ReplyDeletechala bagunnyi.
ReplyDeleteఅప్రతిహతంగా సాగుతున్న మీ హైకులు చాలా బాగున్నాయ్....
ReplyDeleteచమత్కారం, వార్త చక్కగా ఉన్నాయ్... భావాత్మకంగా,శోభగా సాగుతున్నయి...
ఇక్కడ చివరి హైకు నాకు చాలా బాగా నచ్చింది.. dhanyavaadaalu