Wednesday, December 7, 2011

మా ఊరి హైకూలు






7 .  బడికెళ్ళేదారిలో
తిరిగే కుమ్మరిచక్రం
నన్నెవరో మలుస్తున్నట్లు౦డేది


 8 .    మే౦ బళ్లోకి
      పరిగెత్తికెళ్ళేవాళ్ళం 
      మా బడి నడక నేర్పి౦ది

9 .  బళ్ళో నాటకం వేసాం
    మీసాలూడి పంచె జారింది
    ప్రధమ బహుమతి నాదేలేండి
  
 10  . బడిని ఒదిలేసినప్పుడు
     చెమ్మగిల్లిన కళ్ళని
     తలాకాస్తా పంచుకున్నాం

11 . అఆలు నేర్పిన మాస్టారుకి
     సన్మాన పత్రం రాసాను
    ఒక్క తప్పూలేదని గర్వపడ్డారు   
 
12 . చివరిసారిగా చెక్కకుర్చీని
       మమ్మల్ని చూడాలన్న మాస్టారుకి
       కన్నీటిపొర అడ్డొచ్చింది  

1 comment:

  1. బడికెళ్ళేదారిలో
    తిరిగే కుమ్మరిచక్రం
    నన్నెవరో మలుస్తున్నట్లు౦డేది

    అఆలు నేర్పిన మాస్టారుకి
    సన్మాన పత్రం రాసాను
    ఒక్క తప్పూలేదని గర్వపడ్డారు

    వహ్ వా వహ్ వా...చాలా బావున్నాయి. నా బడి జ్ఞాపకాలని తట్టి లేపారు.

    ReplyDelete