ఆమె అందమొక కేంద్ర బిందువు లేని వృత్తం
పసుపచ్చని నీరెండలో లీలగా వెలసిన సన్నని వర్షం
చిమ్మచీకట్లో సుతారంగా అంతర్లీనమైన కాంతిపుంజం
పండువెన్నెల్లో వెల్లివిరిసిన ముద్ద మందార పుష్పం
ఇంత తీరాన్ని కొంత దూరం వొదిలివెళ్ళిన కల్లోల సముద్రం
నున్నగా జారే వేయి వొంపుల్ని సొంతం చేసుకున్న మరకత శిల్పం
పదునుతో రెండువైపులా మెరుస్తోన్న రత్న ఖచిత సౌందర్య ఖడ్గం