Saturday, December 17, 2011

మా ఊరి హైకూలు -53

48 . ఎన్ని రైళ్ళోచ్చినా
నీలికళ్ళ అమ్మాయి
దిగనేలేదు

49  రైలుదిగగానే
జ్ఞాపకాల వర్షం
ఊరు ఉప్పొంగేది

50 . పట్టాల మీద
పదిపైసలు పెట్టేవాళ్ళం
రూపాయి కానేలేదు

51 మలుపుతిరిగినప్పుడల్లా
వెళ్ళిపోయే రైలు
వయ్యారాలు చూడాలి

52 పాలపిట్టలు
భుజాలమీద వాలేవి
కువకువలన్నీ హైకూలే

53 . తుమ్మచెట్టు నిండా
ఇంకా ఊగుతున్నాయి
జ్ఞాపకాల గూళ్ళు

2 comments:

  1. <<తుమ్మచెట్టు నిండా
    ఇంకా ఊగుతున్నాయి
    జ్ఞాపకాల గూళ్ళు

    ఇది అన్నీటికన్నా ఎక్కువ నచ్చేసింది.. :)

    ReplyDelete