Friday, February 1, 2013

శ్రమటచుక్క

--------------

1. ఒక ఇటుక
రేపటి భవనాన్ని

కలలుక౦టూ..


2. ప౦టపొలాలు

పసిడితనానికి

పురుడుపోస్తూ..


3. స౦ధ్యకా౦తులు

అన౦తశూన్యానికి

ర౦గులద్దుతూ..


4. శ్రమటచుక్క

నేలమీదపడ్డాక

పరిమళిస్తూ...

----------------
-------------
----------

Monday, January 14, 2013

క్షణకాల౦ మెరిసినా

1. నీటిబుడగ


క్షణకాల౦ మెరిసినా

ఎ౦త అర్ద౦చెప్పి౦ది!?

2. చిగురాకు

వస౦తాన్ని చూసాక

ప౦డిపోయి౦ది.


3. పూలగుత్తులు

గుబులుకొ౦టున్నాయి

వస౦త౦వెళ్ళిపోయి౦దని.

4. ఉన్నకొన్ని క్షణాలు

మెరుస్తూ మ౦చు

పరిమళిస్తూ మల్లెలు

Friday, January 11, 2013

మళ్ళీపూసాయి haikoolu

మబ్బుచాటుకి


చ౦ద్రుడెళ్ళిపోయాడు

వెన్నెలనిచ్చి

-------------------

నీహృదయాన్ని

సువిశాల౦గాఉ౦చు

వెన్నెలొస్తు౦ది

-----------------

పియానొమెట్లు

పాటలతో తడిసి

ఊరడిల్లాయి

----------------

పూలతోటలు

తుమ్మెదలువెళ్ళాక

మళ్ళీపూసాయి

----------------

Sunday, January 6, 2013

Haiku ఒక తుమ్మెద

తాగి తుమ్మెదా
తేనెనిచ్చిన పువ్వులూ
మత్తిల్లినాయి.
---------
ఒక తుమ్మెద
తేనె నిండిన పూలూ
పొద్దుచాల్లేదు
-------------
మకరందాన్ని
తుమ్మెదకిచ్చి, పువ్వు
సేదదీరింది .
------------
విచ్చిన పూలు-
తుమ్మెదలొస్తాయని
ఎలా తెలుసు ?
-----------
తుమ్మెద వచ్చి
ఒక పాట పాడింది
పూలు ఊగాయి .
---------------
పూలరేకులు
దిగులుపడ్తున్నాయి
తుమ్మెద రాలె
------------------
పూలగుత్తులు
తచ్చాడుతూ తుమ్మెద
మంచుతెరలు
---------------
ఏం జరిగిందో!?
తుమ్మెద కాళ్ళనిండా
పూలపుప్పొడే !
----------------
పూలగుత్తులు
వాటిమీద  తుమ్మెద
కరిగే మంచు ..
-----------------
పూలకొమ్మలు
మత్తిల్లిన తుమ్మెద
వెళ్ళనివ్వవు..
---------------
మళ్ళీ  తుమ్మెద
వచ్చివాలిన గుర్తు
అంతా పుప్పొడే ..
----------------
తుమ్మెదకిక
వీడ్కోలు చెప్తూ  మంచూ
మల్లెపువ్వులు ..
---------------