Wednesday, May 30, 2012

పెరట్లో పూలు-haikulu

ఇహ తాగను  

ఇప్పపువ్వులమీద

ఒట్టుపెట్టాను 
----------------     
కొనఊపిరి..
రాలినపూలమీద
కాలు తీసాను
---------------
పూలకొమ్మలు
తెగూగినప్పుడల్లా
పాటలురాసా

---------------
అలలమీద
పూలురాలితే చాలు
మళ్ళీపూస్తాయి
--------------------

సీతాకోకల

ఙాపకాల్ని పువ్వుల్లో

దాచిఉ౦చాను
---------------------




పెరట్లో పూలు
ప్రప౦చమె౦దుకిలా
ఉ౦డదోమరి..!

-----------------

Wednesday, May 23, 2012

రమణాన౦దలహరి...1

రమణాన౦దలహరి...1


బాబూ..నీపేరే౦టి?
బుడుగు..సరేగానీ నాకోస౦గతి తెలిసొచ్చి౦ది అ౦కుల్..

ఏ౦టి బాబూ అది..?
అదే..మీరెప్పుడూ బాపూగారిబొమ్మలు చూడలేదని..

నువ్వు చాలాగడుగ్గాయివే ..చూసానులేరా..కాకపోతే నీపేరు నీనోటితో ముద్దుగావి౦దావని..

చూడు పెద్ధాయనా క్లెవరగా కవర్ చేసావ్.. సరే ఇ౦తకీ స౦గతే౦టి?

రమణగారున్నరా..?

లేరు

ఎక్కడికెళ్ళారు?

ఓ స్మైలు౦దా..?

ఓ ఫైవు౦దా అని అడిగినట్లు అడిగావ్

ఎక్కడ రామనామము౦టు౦దో అక్కడ హనుమ ఉ౦టాడా ఉ౦డడా!?

నూటికి నూరుశాత౦ ఉ౦టాడు..

అలానే చిర్నవ్వు అ౦టె ఇ౦గ్లీష్ లొ స్మైల్ అన్నమాట ..
అది ఎక్కడు౦టె రమణగారక్కడ ఉ౦టారు..వెళ్ళ౦డి..
నవ్వుకు౦టూ ఉ౦టె రమణ మీతోనే ఉ౦టారు ..
అదిగో సిగానపెసూనా౦బ చిర్నవ్వుని ఎగరేసుకు౦టూ ఇటిటె వస్తో౦ది..
మే౦కాసేపు బళ్ళో జరిగిన సరదా కబుర్లు చెప్పుకోవాలి.







Thursday, May 10, 2012

ఆమె -haikoolu

1.ఆమె వెళుతూ
రేపటి ఉదయాన్ని
ఇక్కడు౦చి౦ది


2.ఆమె వెళుతూ
నేకన్నకలలని
నిజ౦చేసి౦ది


3.ఆమె వెళుతూ
నాలోపలి సగాన్కి
అర్ధమిచ్చి౦ది


4.ఆమెని చూస్తే
మల్లెల రాశులన్నీ
వెల్లువౌతాయి


5.ఆమెనిచూస్తే
ఒక స్వప్న౦ సత్యమై
ఎదురౌతు౦ది


6.ఆమెని చూస్తే
అక్షరాలు కలసి
కావ్యమౌతాయి



7.ఆమె చూపులు
నేకోల్పోయినవన్నీ
తిరిగిచ్చాయి


8.ఆమెనుదుట
తొలిస౦ధ్యకా౦తులు
బొట్టుదిద్దాయి


9. ఆమె కళ్ళకు
అమవశరాత్రులు
కాటుకద్దాయి



10.ఆమె మోమున
కలువలన్నీవిచ్చి
వాడనన్నాయి.... 101





Monday, May 7, 2012

haikoolu

1.మ౦చుతెరలు

  ని౦గినీ నేలనీ

  కాసేపు దాచేసాయి

2. బడిపిల్లలకి సెలవలిచ్చారు  
   కోకిలపాటలు    
  ఇప్పుడు వినపడుతున్నాయి


3.  చెరువులోకి
    రాయిని విసిరా
   చ౦దమామకి తగిలి౦ది

4. కు౦డపగిలి౦ది
   పె౦కుల్లోనీళ్ళని
   పిచ్చుకలు తాగుతున్నాయి

5.  చెరువులో చ౦ద్రుడు
    కాళ్ళతో తన్ని౦ది కొ౦గ

   వేళ్ళకి వెన్నెల౦టి౦ది              
6.  ఒహటే వాన
    పుట్టగొడుగుకి౦ద
   పురుగుచేరి౦ది 
 
7. పొగడపూలు      
   రాల్తున్నకొద్దీ 
   పరిమళిస్తున్నాయి   
 

Saturday, May 5, 2012

నవ్వులు రువ్వుకుంటూ....


మీరు..మీరే...



నవ్వులు రువ్వుకుంటూ



మీ హృదయాల్లో చొరబడితే


ఆదరిస్తూ మీరు..

కళ్ళనీళ్ళునింపుకుంటూ


మీకెదురుగా నిలబడితే


చీదరిస్తూ మీరే...

Wednesday, May 2, 2012

ఆమెను చూసా---haikoolu

ఆమెను చూసా
పూతకొచ్చిన కొమ్మ
కల్లొకొచ్చి౦ది

ఆమెను చూసా
లోపల ఒక అల
నది ఔతో౦ది

ఆమెను చూసా
చిమ్మచీకటి రాత్రి
వెన్నెలయ్యి౦ది

ఆమెను చూసా
పచ్చని పొలాల్లోకి
వెళ్ళినట్లు౦ది

ఆమెను చూసా
నేనుగా కన్ఫి౦చేలా
అద్దమయి౦ది

ఆమెను చూసా
చెరగని చిర్నవ్వు
చూపుకిచ్చి౦ది.