Friday, December 16, 2011

మా ఊరి హైకూలు

42 . తుమ్మముల్లు దిగింది
కుమ్మరమ్మాయి
ఉమ్మురాసి తీసింది

43 . తూనీగలం మేం
పోటీపడి ఎగిరేవాళ్ళం
మేమిలా మిగిలిపోయాం

44 . లాంతరు లేనప్పుడు
మా ఇంటిదాకా తోడువచ్చేది
తనెలా వెళ్ళేదో

45 . ఎర్ర వోణీని
కళ్ళకు ఆన్చేది
ప్రపంచమొక మందారం

46 . పలక మీద
నాపేరు రాసేది
చేరిపేసేది

47  పోరుగూరమ్మాయి
వెళ్ళినప్పుడల్లా
వెనక్కితిరిగి చూసేది

5 comments:

  1. ఎర్ర వోణీని
    కళ్ళకు ఆన్చేది
    ప్రపంచమొక మందారం.చాలా బాగుంది.

    ReplyDelete
  2. అక్షరమోహనంగారికి మీవూరి హైకూలే మావూరి హైకూలుగా బాల్యస్మ్రుతులు
    బాగా గుర్తుకు వస్తున్నాయి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను
    ధన్యవాదములు

    ReplyDelete
  3. ఈ హైకూలతో తేనెతుట్టను కదిపేస్తున్నారు గురూజీ. మీవూరిలో నా వూరూ, మీ బాల్యంలో నా బాల్యం ఉన్నాయేమో ననిపిస్తూంది

    ReplyDelete
  4. Rajasekhara Sarma garu and Bolloju baba garu.. Thanks for your early responce.. you are all hearing my heart beat.

    ReplyDelete