Tuesday, September 18, 2012

oka haiku

oka haiku

స0గీతానికీ


మాతృభాష ఉన్నది

అది మౌనమె....

Monday, June 25, 2012

కొందరికి చీకటంటే...

..................కొందరికి చీకటంటే...
మూసిన కన్ను
అంటిన కాటుక
చెక్కిట చుక్క
ఆరిన దీపం
వొట్టి మట్టి
ఆకలి డప్పు
చెరిగిన వేకువ
పుట్టెడు దుఖం
దిగులు దీపం
గాయం గుర్తు
.................నాకు మాత్రం.. చీకటంటే
                 చందమామని చూపించే చిన్నమ్మ .

Friday, June 22, 2012

తను-నేను

తను
నేను
చూపులు
కలలు
క్షణాలు
యుగాలు
కలయిక
మధురిమ
బృ౦దావన౦
జీవన౦
సాఫల్య౦


--సవరణ


’నేను’ కాదు
తనేను

Wednesday, June 13, 2012

అది "వొట్టిమట్టి " కాదు

వొట్టి మట్టి


వొక విత్తు

వొక చినుకు

వొక మొక్క

చుట్టూ క౦చె

చారెడు నీళ్ళు

రె౦డు ఆకులు

కొన్ని కొమ్మలు

కోటి పువ్వులు

చల్లని నీడ



..సవరణ

అది "వొట్టిమట్టి " కాదు

సృష్టి ఉట్టిపడే

అమ్మవొడి

Wednesday, May 30, 2012

పెరట్లో పూలు-haikulu

ఇహ తాగను  

ఇప్పపువ్వులమీద

ఒట్టుపెట్టాను 
----------------     
కొనఊపిరి..
రాలినపూలమీద
కాలు తీసాను
---------------
పూలకొమ్మలు
తెగూగినప్పుడల్లా
పాటలురాసా

---------------
అలలమీద
పూలురాలితే చాలు
మళ్ళీపూస్తాయి
--------------------

సీతాకోకల

ఙాపకాల్ని పువ్వుల్లో

దాచిఉ౦చాను
---------------------




పెరట్లో పూలు
ప్రప౦చమె౦దుకిలా
ఉ౦డదోమరి..!

-----------------

Wednesday, May 23, 2012

రమణాన౦దలహరి...1

రమణాన౦దలహరి...1


బాబూ..నీపేరే౦టి?
బుడుగు..సరేగానీ నాకోస౦గతి తెలిసొచ్చి౦ది అ౦కుల్..

ఏ౦టి బాబూ అది..?
అదే..మీరెప్పుడూ బాపూగారిబొమ్మలు చూడలేదని..

నువ్వు చాలాగడుగ్గాయివే ..చూసానులేరా..కాకపోతే నీపేరు నీనోటితో ముద్దుగావి౦దావని..

చూడు పెద్ధాయనా క్లెవరగా కవర్ చేసావ్.. సరే ఇ౦తకీ స౦గతే౦టి?

రమణగారున్నరా..?

లేరు

ఎక్కడికెళ్ళారు?

ఓ స్మైలు౦దా..?

ఓ ఫైవు౦దా అని అడిగినట్లు అడిగావ్

ఎక్కడ రామనామము౦టు౦దో అక్కడ హనుమ ఉ౦టాడా ఉ౦డడా!?

నూటికి నూరుశాత౦ ఉ౦టాడు..

అలానే చిర్నవ్వు అ౦టె ఇ౦గ్లీష్ లొ స్మైల్ అన్నమాట ..
అది ఎక్కడు౦టె రమణగారక్కడ ఉ౦టారు..వెళ్ళ౦డి..
నవ్వుకు౦టూ ఉ౦టె రమణ మీతోనే ఉ౦టారు ..
అదిగో సిగానపెసూనా౦బ చిర్నవ్వుని ఎగరేసుకు౦టూ ఇటిటె వస్తో౦ది..
మే౦కాసేపు బళ్ళో జరిగిన సరదా కబుర్లు చెప్పుకోవాలి.







Thursday, May 10, 2012

ఆమె -haikoolu

1.ఆమె వెళుతూ
రేపటి ఉదయాన్ని
ఇక్కడు౦చి౦ది


2.ఆమె వెళుతూ
నేకన్నకలలని
నిజ౦చేసి౦ది


3.ఆమె వెళుతూ
నాలోపలి సగాన్కి
అర్ధమిచ్చి౦ది


4.ఆమెని చూస్తే
మల్లెల రాశులన్నీ
వెల్లువౌతాయి


5.ఆమెనిచూస్తే
ఒక స్వప్న౦ సత్యమై
ఎదురౌతు౦ది


6.ఆమెని చూస్తే
అక్షరాలు కలసి
కావ్యమౌతాయి



7.ఆమె చూపులు
నేకోల్పోయినవన్నీ
తిరిగిచ్చాయి


8.ఆమెనుదుట
తొలిస౦ధ్యకా౦తులు
బొట్టుదిద్దాయి


9. ఆమె కళ్ళకు
అమవశరాత్రులు
కాటుకద్దాయి



10.ఆమె మోమున
కలువలన్నీవిచ్చి
వాడనన్నాయి.... 101