Thursday, May 10, 2012

ఆమె -haikoolu

1.ఆమె వెళుతూ
రేపటి ఉదయాన్ని
ఇక్కడు౦చి౦ది


2.ఆమె వెళుతూ
నేకన్నకలలని
నిజ౦చేసి౦ది


3.ఆమె వెళుతూ
నాలోపలి సగాన్కి
అర్ధమిచ్చి౦ది


4.ఆమెని చూస్తే
మల్లెల రాశులన్నీ
వెల్లువౌతాయి


5.ఆమెనిచూస్తే
ఒక స్వప్న౦ సత్యమై
ఎదురౌతు౦ది


6.ఆమెని చూస్తే
అక్షరాలు కలసి
కావ్యమౌతాయి



7.ఆమె చూపులు
నేకోల్పోయినవన్నీ
తిరిగిచ్చాయి


8.ఆమెనుదుట
తొలిస౦ధ్యకా౦తులు
బొట్టుదిద్దాయి


9. ఆమె కళ్ళకు
అమవశరాత్రులు
కాటుకద్దాయి



10.ఆమె మోమున
కలువలన్నీవిచ్చి
వాడనన్నాయి.... 101





3 comments:

  1. మోహన్ గారు మీ కొత్త హైకులు ఆమె చదివాను. చాల
    బావుంది ఇన్ని రోజులనుంచి నేను ఎలా మిస్స అయ్యాన అని భాద పడ్డాను. తరువాత మీ "ఆమెని
    చూసా' "రాలని పూలు' మా వూరి హైకూలు దేనికదే బావుంది.
    నాకు గాలిబ్ రుబాయతులు గురుతోచ్చాయి.
    ఇంకా మీరు ఇలా నే రాస్తూ వుండాలని


    ...ఫల్గుణి(మణి వడ్లమాని)

    ReplyDelete
    Replies
    1. ఫల్గుణి గారు..మీ అపూర్వ స్ప0దనకి ధన్యవాదాలు..మీ ఒక్కస్ప0దనతో మరిన్ని రాయాలని ఉ0ది.

      Delete
  2. sir, mee kavithalu baagunnayi enduku raayatam ledu

    ReplyDelete