Showing posts with label వెండి వెన్నెల..ఆరు హైకులు. Show all posts
Showing posts with label వెండి వెన్నెల..ఆరు హైకులు. Show all posts

Saturday, February 20, 2010

వెండి వెన్నెల- ఆరు హైకులు

మంచు రేణువు
పచ్చని చిగురాకు
హైకు మెరుస్తూ ..!
.........................
ఏటి అలలు
చిరుగాలి పాటలు
హైకు చేరింది.
.........................
గోరింటాకు
పాప చిట్టి చేతులు
హైకు పండింది.
.......................
వెండి వెన్నెల
చల్లని రాత్రి జోల
నిద్రలో హైకు.
....................
అక్షరాలకి
కవిత్వాన్ని అద్దితే
వచ్చింది హైకు.
....................
అ ఆ యి ఈ లు
దిద్దుకుంటున్న పాప
కావ్యమై హైకు.
........................
అక్షరాలకి
కవిత్వాన్ని అద్దితే
వచ్చింది హైకు.
......................