Sunday, March 6, 2011

తీరని దాహం

నా లోపల ఓ మొక్కను నాటాను
కొంత కాలానికి అది చెట్టయింది
ముందు కొన్ని ఊ హాలు పూచాయి
అవి సీతా కోక చిలుకలతో జతకట్టి ఎటో ఎగిరిపోయాయి ..!
కొన్నాళ్ళకి పూలు గుత్తులు గుత్తులుగా పూచాయి
అవి పరిమళిస్తూ కొత్త రంగులిని కోరుకుంటున్నాయి ..
రోజూకొన్ని పక్షులు వాలుతున్నాయి
అవి నిరంతరం గుసగుసలాడుతున్నాయి
బహుశా : కవిత్వంలోని కొత్త కొత్త సంగతులను కొంటా...!!
ఒక కోకిల కొత్త కవులిని పిలుస్తోంది
కొంతమంది కవులు
నా చెట్టు నీడన చేరారు ...
'కవిత్వం' అనేది ఏమీ చెప్పలేదు కానీ
కన్నీటిభాషలో మనసులోని మనిషిని తడుముకున్నారు ..
'కవిత్వమొక తీరని దాహం ' అని గొణుక్కుంటున్నారు ..
నాలోపల చాలా మొక్కలు నాటాను
చాలా మంది కవులు
నన్నూ, నాచెట్టుని ప్రశ్నిస్తున్నారు
ఈ దాహం తీరేదెప్పుడని ...??

4 comments:

  1. ఎప్పటికీ తీరదు..బాగుందండి

    ReplyDelete
  2. నా మిత్రుడు అశొక్ అన్నారు..' కవిత్వం దాహాన్ని తీర్చేదికాదూ..దాహాన్ని పెంచేది ' అని.. thanks for your nice responce..

    ReplyDelete
  3. It's so good. I missed reading it immediately after he passed away.

    madhuri.

    ReplyDelete
  4. When will you post your daughter's poetry?

    madhuri.

    ReplyDelete