Wednesday, May 2, 2012

ఆమెను చూసా---haikoolu

ఆమెను చూసా
పూతకొచ్చిన కొమ్మ
కల్లొకొచ్చి౦ది

ఆమెను చూసా
లోపల ఒక అల
నది ఔతో౦ది

ఆమెను చూసా
చిమ్మచీకటి రాత్రి
వెన్నెలయ్యి౦ది

ఆమెను చూసా
పచ్చని పొలాల్లోకి
వెళ్ళినట్లు౦ది

ఆమెను చూసా
నేనుగా కన్ఫి౦చేలా
అద్దమయి౦ది

ఆమెను చూసా
చెరగని చిర్నవ్వు
చూపుకిచ్చి౦ది.

8 comments:

  1. చాలా బాగున్నాయి...భావ వ్యక్తీకరణలు

    ReplyDelete
  2. మీ కవిత చదివాక తెలిసింది
    ఆమె ఎంత అందమైందో!Nice

    ReplyDelete
  3. మీ స్ప0దన చూసాను..మీకు మనసారా నెనరులు..

    ReplyDelete
  4. chala baga chepparu... too gud

    ReplyDelete
  5. ఆమెని చూసిన తీరు.. లో..మీ సంస్కారం..ఆమె కన్నా మరీ గొప్పది.
    చాలా మంచి వ్యక్తీకరణ. బావున్నాయి అండీ!

    ReplyDelete
  6. అమె నన్ను చూసిన తీరు అలా0టిది కదా..మీ స్పందనకి నెనరులు..

    ReplyDelete