Friday, April 29, 2011

చిన్న చిన్న అలలు

రెండుకొండల మధ్య
పడవ మెల్లగా వెళ్తోంది
చాన్నాళ్ళ గాయాలని మోసుకొంటూ ..
అన్ని తీరాలలోనూ
నెత్తురోడుతున్న జ్ఞాపకాలే.....!
కంట తడి అంటని కొత్త జ్ఞాపకాలని వెతుక్కుంటూ
ఓ చోట ఆగి దోసిళ్ళలో నీరు తీసుకున్నాను.
కొన్ని చిన్ని చిన్ని అలలు
నా ప్రతిబింబాన్ని తమ ఒడిలోకి తీసుకొని
తల నిమురుతున్నాయి.
ఈ చిన్ని లాలన చాలదా ..నా పడవ ప్రయాణానికి ?
జ్ఞాపకాల గాయాలు మానడానికి??

1 comment:

  1. చాలా..బాగుంది.కంటతడి అంటని కొత్త జ్ఞాపకాలు వెతుక్కుంటూ.. ఆశావాదం..చిన్నిలాలన.

    ReplyDelete