Sunday, January 6, 2013

Haiku ఒక తుమ్మెద

తాగి తుమ్మెదా
తేనెనిచ్చిన పువ్వులూ
మత్తిల్లినాయి.
---------
ఒక తుమ్మెద
తేనె నిండిన పూలూ
పొద్దుచాల్లేదు
-------------
మకరందాన్ని
తుమ్మెదకిచ్చి, పువ్వు
సేదదీరింది .
------------
విచ్చిన పూలు-
తుమ్మెదలొస్తాయని
ఎలా తెలుసు ?
-----------
తుమ్మెద వచ్చి
ఒక పాట పాడింది
పూలు ఊగాయి .
---------------
పూలరేకులు
దిగులుపడ్తున్నాయి
తుమ్మెద రాలె
------------------
పూలగుత్తులు
తచ్చాడుతూ తుమ్మెద
మంచుతెరలు
---------------
ఏం జరిగిందో!?
తుమ్మెద కాళ్ళనిండా
పూలపుప్పొడే !
----------------
పూలగుత్తులు
వాటిమీద  తుమ్మెద
కరిగే మంచు ..
-----------------
పూలకొమ్మలు
మత్తిల్లిన తుమ్మెద
వెళ్ళనివ్వవు..
---------------
మళ్ళీ  తుమ్మెద
వచ్చివాలిన గుర్తు
అంతా పుప్పొడే ..
----------------
తుమ్మెదకిక
వీడ్కోలు చెప్తూ  మంచూ
మల్లెపువ్వులు ..
---------------

4 comments:

  1. baavundi
    తుమ్మెదకిక
    వీడ్కోలు చెప్తూ మంచూ
    మల్లెపువ్వులు ..

    ReplyDelete
    Replies
    1. just before posting, I got this IDEA..ended with this Haiku.. Thanks for your response..

      Delete
  2. Good work. Keep it up.
    Visit my blog: www.niftysiri.in and http://niftysiri.blogspot.in/.
    We are giving calls with contract note proof.
    Wish u all the best.
    niftysiri

    ReplyDelete