Tuesday, November 27, 2012

ఆమె అందమొక కేంద్ర బిందువు .......

ఆమె అందమొక కేంద్ర బిందువు లేని వృత్తం


పసుపచ్చని నీరెండలో లీలగా వెలసిన సన్నని వర్షం

చిమ్మచీకట్లో సుతారంగా అంతర్లీనమైన కాంతిపుంజం

పండువెన్నెల్లో వెల్లివిరిసిన  ముద్ద మందార పుష్పం

ఇంత తీరాన్ని కొంత దూరం వొదిలివెళ్ళిన కల్లోల సముద్రం

నున్నగా జారే వేయి వొంపుల్ని సొంతం చేసుకున్న మరకత శిల్పం

పదునుతో రెండువైపులా మెరుస్తోన్న రత్న ఖచిత సౌందర్య ఖడ్గం




3 comments:

  1. 1. వెన్నెల్లో మందార పుష్పం విరియడమేంటి? మందారం ఉదయం పూచే పువ్వు, సాయంత్రానికి కాస్త వాడుతుంది.
    (వెన్నెల్లో విరిసే పువ్వుగా కలువ ని ఉదహరించవచ్చు, ఇంకా ఏవో ఉన్నాయి గాని నాకు గుర్తులేదు).
    ఒక వేళ మీరు రాసింది సరిగానే ఉంటే కాస్త వివరించండి.

    2. "పసుపచ్చ" లేక "పసుపుపచ్చ"? వీటిల్లో ఏది సరైనది?

    3. "సుతారంగా అంతర్లీనమైన కాంతిపుంజం" - ఇది కూడా అర్ధం కాలేదు.

    ఈ సందేహాల సంగతి పక్కనపెడితే మీ కవిత బాగుంది.

    ReplyDelete
  2. ప్రియ మిత్రమా!
    మీ కవిత నన్ను; నాలోని నన్ను ఆలోచింప చేసింది.

    ReplyDelete