Wednesday, May 18, 2011

దాచుకున్న రెక్కలు

మా అమ్మాయికి వాళ్ళమ్మ తలదువ్వి
నోట్లో ఇంత కుక్కి
బండెడు బరువు భుజాన పడవేసి
బడికి పంపుతుంది.
ఇల్లు వదిలి
కొంత దూరం వెళ్ళాక
మా అమ్మాయి
బరువునంతా ఒక చోట పడవేసి
దాచుకున్న రెక్కల్ని నెమ్మదిగా బయటకు తీసి
పక్షులతో కలసి ఎగిరి ఎగిరి
ఆనందంగా అలసి పోతుంది.
చెరువునిండా విచ్చుకున్న కలువ పూవుల్ని
కళ్ళారా చూసి
మనసారా పలకరించి
ఎన్నో జ్ఞాపకాలని
తన స్నేహితులకోసం దాచిపెడుతుంది.
పచ్చని పొలాల గట్లమీద
పాదముద్రలు ముగుల్లా వేసుకుంటూ వెళ్తుంది.
రొజూ ఇదే తంతు..
పరీక్షలోచ్చాయి..
మా అమ్మాయికి నూటికి నూరు మార్కులు -లెక్కల్లో.
వాళ్ళ అమ్మ
ఇరుగమ్మకి- పోరుగమ్మకి
తెగచేప్పుతుంటుంది .
-----లెక్కల్లో మార్కులు చెప్పుకుంటూ మా ఆవిడా ..
-----రెక్కలు దాచుకుంటూ మా అమ్మాయి.

7 comments:

  1. Ismail gaaru gurtuki vacchaaru mee padya chadivite. Please consider this as a complement...

    ReplyDelete
  2. మోహనా, చాలా బాగుంది ఈ పోయెం! ఎలా వున్నావ్?

    ReplyDelete
  3. Afsar ..we are fine. I have something to talk about my haikoos.

    ReplyDelete
  4. మోహనా,

    అట్లే కానిమ్ము...నేను ఈ ఆదివారం ఫోన్ చేస్తాను...

    ReplyDelete
  5. పాతపుస్తకాలు ఏదో సందర్భంలో అవసరం వచ్చి చూస్తుంటే, పేజీల మధ్యనుండి అకస్మాత్తుగా రాలిన నెమలి ఈకలా మృదువుగా, నాస్టాల్జిక్ గా ఉంది. చాలా బాగుంది.
    మూర్తి

    ReplyDelete