రమణగారి పెన్ను
తెలుగుభాషకి వెన్ను
నిలబెట్టేను నిన్ను నన్ను
ఓ గోదారమ్మ ...!
కనులు మూసిన బొమ్మ
రమణ గారిదేనమ్మ
బాపు గీయలేరమ్మ
ఓ గోదారమ్మ ...!
రమణగారి బుడుగు
అసలుపేరు అల్లరి పిడుగు
మనసే౦టో మల్లెపువ్వునడుగు
ఓ గోదారమ్మ...!
కోతికొమ్మచ్చి
తెలుగువాళ్ళ కిచ్చి
చదు౦కొమన్నారు గిచ్చి
ఓ గోదారమ్మ ...!
భట్టుగారి అట్టు
రమణగారు తిన్నట్టు
తెలిసాక తెలిసి౦ది పెసరట్టు గుట్టు
ఓ గోదారమ్మ...!
చిన్నమాటకి తల౦టెను
పాపిట తీసి బొట్టు పెట్టెను
రె౦డుజెళ్ళ సీత అని పేరెట్టెను
ఓ గోదారమ్మ...!
మాటలని మూటకట్టి
మన గుండెలో దాచిపెట్టి
రమణ వెళ్ళారు పెన్ను పక్కనెట్టి
ఓ గోదారమ్మ...!
'స్వాతి ' ఈ వారం పత్రికలో పేజి ఆరు లో ప్రచురణ
Subscribe to:
Post Comments (Atom)
కొంటె రాతల రమణ
ReplyDeleteకన్నుమూసేను గాన
కన్నీరోలికే జగాన
ఓ గోదారమ్మా
కోతికొమ్మచ్చాడి
బాపుగారిని వీడి
ఒంటరాయెను జోడి
ఓ గోదారమ్మా
బుడుగు ఏడుపు చూసి
బ్రహ్మ కన్నులు తడిసి
రమణనంపచ్చుగా తిరిగి ప్రాణం పోసి
ఓ గోదారమ్మా
మీరు నాకు 'కొంటె0పరరీ' అయిన0దుకు చాలాహాపీగా ఉంది.ఎ0త తొందరగా రాసారు..!!!
ReplyDeleteబావుంది.
చాలా బావుందండీ....శంకర్ గారూ మీ కొనసాగింపు కూడా బావుంది.
ReplyDeleteThanks to Sankar and Soumya
ReplyDeleteచాలా బాగుంది శంకర్ గారు
ReplyDelete"ఆకు " పై కవితా పోటీకి, ఇంతవరకు వచ్చిన కవితలు
ReplyDeletehttp://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html