తలుపులు తీసి
ఆమె నవ్వుతూ ఎదురౌతుంది.
దోసిట్లోంచి చందమామలు కొన్ని
ఇల్లంతా చెల్లాచెదురుగా దొర్లుతుంటాయి.
ఒక సీతాకోకచిలుక
ఆమె జడలో మల్లెపూలపై వాలి
వెళ్లాలనిపించక రెక్కలు దాచుకుంటుంది.
పిల్లలు నన్నల్లుకొని
నా కాళ్ళ దగ్గర పూలతీగలల్లె
పరిమళిస్తూ ఉంటారు.
రేపటి బరువు
దూదిపింజలా
రెప్పలమీంచి ఎగిరిపోతూ ఉంటుంది.
ఆకాశం ఆమె అరచేతిలో
వెన్నెల్ని గోరింట పెడ్తుంది.
సంధ్య కా౦తుల్లొ ఆమె గోరింట చేతులు
నన్ను వివసుడిని చేస్తాయి. .
మళ్ళీ మళ్ళీ తెరచుకునే తలుపుల కోసం
ఎదురయ్యే ఆమె నవ్వు కోసం
నేను బయటకు తప్పనిసరిగా వెళ్తాను.
Tuesday, March 1, 2011
Subscribe to:
Post Comments (Atom)
మొహన్ గారు నమస్తె!
ReplyDeleteమీ కవితలు దేనికవే సాటి!
విషయాన్ని నర్మ గర్భంగా చెబుతున్నారంటే...
మిమ్మాల్ని మీరుగా అర్థంచేసుకునే వారు మీ చుట్టుపక్కల్లో చాలా కొద్ది మందే వుండి వుంటారు...వారు నిజంగా అదృష్టవంతులు!
నిజంగా చాలా బావుందండి..ధన్య వాదాలు.
ఔను సత్య గారు..! చాలా కొద్ది 'ఒకరే' ఉన్నారు.మీ సత్య స్పందనకి ధన్యవాదాలు.
ReplyDelete