Tuesday, August 9, 2011

'మో' గిన శబ్దం

'మో' ఒక నిర్లిప్త సంధ్య
సందిగ్ధ సాయంకాలం
స్పష్టాతీత స్పష్టం
దిగులు లోగిలి
దాగిన తీగ
సహృదయ వృత్తం
కొండచరియల ఛాయ
ఆపేక్ష క్షేత్ర
వెన్నెల కుంపటి
స్వప్న సంపుటి
సంక్లిష్ట శైలి
సంచలన కరచాలనం
పర్వదిన సంరంభం
పునరపి చరణం
విలయానంతర మౌనం
అపార పారవశ్య వాక్యం
వ్యక్తావ్యక్త పద లాలిత్యం
పునరుత్థాన కవనం
'మో'గిన శబ్దం

5 comments:

  1. మో..నిశ్శబ్దం..కూడా.. యేవో..చెప్పాల్సినవి..మిగిలి ఉన్నాయని..చెప్పటానికి..

    ReplyDelete
  2. "పునరుత్థాన కవనం " అక్కడ దొరికారు నీకు మో!
    ఈ సందర్భంలో ఏం మాట్లాడాలో, ఎలా మాటాడాలో తెలియక నీకు ఫోన్ చేయలేదు. వొక వారం ఆగి మాట్లాడతా. రెడ్డి గారు మళ్ళీ గుర్తొచ్చారు!

    ReplyDelete
  3. ఇది చాలా ఆత్మీయమైన అంచనా. చాలా బాగా వ్రాసారు. అభినందనలు.
    మూర్తి

    ReplyDelete
  4. ఇది చాలా ఆత్మీయమైన అంచనా. చాలా బాగా వ్రాసారు. అభినందనలు.
    మూర్తి

    ReplyDelete
  5. మోహనం గారూ! 'మో' గారి గురించి కొంచెమే తెలుసు. ఇది చదివాక, ఆయనను(రచనలు) మొత్తం చదవాలని ఉంది. బాధాకరమయిన సమయంలో స్పందనాభరితమయిన విధంగా బాగా వ్రాశారు. అభినందనలు.
    రాజా.
    gksraja.blogspot.com

    ReplyDelete